తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్( టీపీఏడీ) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరం, అన్నదాన శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. సేవా చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. గత 12 రక్తదాన శిబిరాలతో 1500 మంది ప్రాణాలను కాపాడామని టీపీఏడీ ప్రతినిధులు ప్రకటించారు. 11 రక్తదాన శిబిరాలతో వెయ్యి మంది ప్రాణాలను కాపాడామ ని దాంతో కార్టర్ బ్లడ్ కేర్ గుర్తించబడిందని వెల్లడించారు. టీపీఏడీ ఏర్పడినప్పటి నుంచి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాయి. గత మూడేళ్ల నుంచి ఏడాదికి రెండుసార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది 13వ రక్తదాన శిబిరం అని నిర్వహకులు తెలిపారు.