యూకే రాజధాని లండన్‌లో మహిళల్లో వచ్చే క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లండన్‌లోని స్లవ్ ప్రాంతంలో, ప్రవాస భారతీయులు స్థాపించిన బెర్క్‌షైర్ భారత్ కమ్యూనిటీ అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. మార్చి నెలలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఈవెం ట్ ను ఘనంగా నిర్వహించారు. ఆడవారిలో వచ్చే సెర్వికల్ కాన్సర్ పై అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆర్గనైజేషన్ కార్య నిర్వాహక సభ్యులు తెలిపారు. కార్యక్రమం ద్వారా 1,655 పౌండ్లను (సుమారు 1.70 లక్షల రూపాయలు) ఒవేరియన్ క్యాన్సర్ యాక్షన్ అనే ఛారిటీకి అందజేశామని తెలిపారు.