Skip to main content

Namaste NRI

లండన్‌లో క్యాన్సర్‌పై  అవగాహన కార్యక్రమం

యూకే రాజధాని లండన్‌లో మహిళల్లో వచ్చే క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లండన్‌లోని స్లవ్ ప్రాంతంలో, ప్రవాస భారతీయులు స్థాపించిన బెర్క్‌షైర్ భారత్ కమ్యూనిటీ అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. మార్చి నెలలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఈవెం ట్‌ ను ఘనంగా నిర్వహించారు. ఆడవారిలో వచ్చే సెర్వికల్ కాన్సర్ పై అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆర్గనైజేషన్ కార్య నిర్వాహక సభ్యులు తెలిపారు. కార్యక్రమం ద్వారా 1,655 పౌండ్లను (సుమారు 1.70 లక్షల రూపాయలు) ఒవేరియన్‌ క్యాన్సర్‌ యాక్షన్‌ అనే ఛారిటీకి అందజేశామ‌ని తెలిపారు.

Social Share Spread Message

Latest News