హృద్రోగ సమస్యలు ఉన్నవాళ్లు ఎప్పుడూ తమ గుండె వేగాన్ని అంచనా వేసుకుంటూ ఉండాలి. దీనికి అమెరికా పరిశోధకులు చక్కని పరిష్కారాన్ని కనిపెట్టారు. గుండెవేగాన్ని అంచనా వేస్తూ అప్రమత్తం చేసే స్మార్ట్ టీ`షర్ట్‌ను అభివృద్ధి చేశారు. అథ్లెట్లు ధరించేట్టు ఉండే ఈ టీ షర్ట్‌ను ధరిస్తే హార్ట్‌బీట్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. దీనికోసం కాటన్‌లా కనిపించే ప్రత్యేకమైన కార్బన్ నానోట్యూట్ ఫైబర్లను వాడినట్లు తెలిపారు. టీ షర్ట్‌పై బ్లూటూత్ ట్రాన్స్‌మిటర్ సాయంతో హార్ట్‌బీట్ వివరాలను మొబైల్‌లో చూసుకోవచ్చన్నారు. ఉతికినా ఈ టీ షర్ట్‌కు ఏమీ కాదని పేర్కొన్నారు. హార్ట్‌బిట్‌ను తెలుసుకోవడానికి ఇప్పటికే మార్కెట్లో స్మార్ట్‌వాచ్‌లు, చెస్ట్‌స్ట్రాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని 24 గంటల పాటు ధరించి ఉండటం కూడా ఇబ్బందే.