బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత పీటర్ హిగ్స్(94) కన్నుమూశారు. స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన తన ఇంట్లో తుదిశ్వాస విడిచారని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ యూనివర్సిటీలో పీటర్ హిగ్స్ దాదాపు 50 ఏండ్లు ప్రొఫెసర్‌గా పని చేశారు. 1964లో ఆయన కనుగొన్న ద్రవ్య రాశి కణ సిద్ధాంతానికి గానూ 2013లో నోబెల్ అవార్డు దక్కింది. బెల్జియంకు చెందిన మరో భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్కోయిస్ ఎంగ్లర్ట్‌తో కలిసి సంయుక్తంగా హిగ్స్ నోబెల్ అందుకున్నారు. పీటర్ హిగ్స్ ఓ అద్భుత మైన వ్యక్తి అని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బరొ పేర్కొంది. ఆయన తన దార్శనికత, సృజనాత్మకతో విశ్వ రహస్యాల గుట్టు విప్పారని పేర్కొంది. పీటర్ హిగ్స్ పరిశోధనలు వేల మంది శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా నిలిచాయ ని, భవిష్యత్తు తరాలు ఆయనను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాయని యూనివర్శిటీ వీసీ పేర్కొన్నారు.