Skip to main content

Namaste NRI

పళ్లి చట్టంబి నుంచి కయాదు లోహర్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల

మలయాళ హీరో టొవినో థామస్‌ నటిస్తున్న పీరియాడిక్‌ మూవీ పళ్లి చట్టంబి. డీజో జోస్‌ దర్శకుడు. కయాదు లోహర్‌ కథానాయికగా నటిస్తున్నది. కథానాయిక కయాదు లోహర్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.1950-60 దశకం మధ్య వలస రైతుల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని, ఆధిపత్యానికి వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం స్పూర్తివంతంగా ఉంటుందని, కథాగమనంలో హీరోయిన్‌ కయాదు లోహర్‌ పాత్ర కీలకంగా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు.ఏప్రిల్‌ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. విజయ రాఘవన్‌, సుధీర్‌ కరమన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: టీజో టోమీ, సంగీతం: జేక్స్‌ బిజోయ్‌, దర్శకత్వం: డిజో జోస్‌ ఆంటోనీ.

Social Share Spread Message

Latest News