నిర్మాత అభిషేక్ నామా డెవిల్ సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతు న్నది. సినిమా పేరు నాగబంధం. ది సీక్రెట్ ట్రెజర్ అనేది ఉపశీర్షిక. ఆధ్యాత్మిక, సాహసోపేత అంశాలతో అభిషేక్ నామా తయారు చేసుకున్న స్క్రిప్ట్ ఇది. అవినాష్ ఇందులో మిస్టీరియస్ అఘోరగా నటిస్తున్నాడు. ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తూ మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. సాంకేతికంగా మరోస్థాయిలో ఈ సినిమా ఉంటుందని, అనుభవజ్ఞులైన సాంకేతికనిపుణులు ఈ సినిమా కు పనిచేస్తున్నారని, హై బడ్జెట్‌లో సాహసాల ప్రపంచంలోకి తీసుకెళ్లేలా సినిమా ఉంటుందని, వచ్చే ఏడాది తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయను న్నామని అభిషేక్ నామా చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీకాంత్ విస్సా, కెమెరా: సౌందర్‌రాజన్, సంగీతం: అభే, నిర్మా: మధుసూదన్‌రావు, సమర్పణ: దేవాన్ష్ నామా.