టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఈ నెలలో భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ తోనూ భేటీ కానున్నారని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా దేశంలో పెట్టుబడులు, టెస్లా కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు కు సంబంధించిన ప్రకటనలు ఉండొచ్చని తెలిసింది. ఢల్లీిలో ఏప్రిల్ 22న ప్రధానితో మస్క్ భేటీ కానున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆపై తన ప్రణాళికలను వేరేగా వెల్లడిరచనున్నారని పేర్కొన్నా యి. ఈ పర్యటనపై అటు ప్రధాని మోదీ కార్యాలయం గానీ, టెస్లా గానీ అధికారికంగా స్పందించలేదు. మస్క్ పర్యటనలో చివరి నిమిషంలో అజెండాలో మార్పులు ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.