యశ్ హీరోగా నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం రామాయణ. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ లార్డ్ రాముడి పాత్రలో నటిస్తుండగా, యశ్ రావణుడిగా కనిపించబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ఏప్రిల్‌లో షురూ అవగా, త్వరలోనే లీడ్ యాక్టర్లు షూట్లో జాయిన్ కాబోతున్నారు. కాగా ఈ సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించ బోతున్నాడు యశ్. రామాయణ చిత్రానికి నమిత్ మల్హోత్రాతో కలిసి యశ్ (సహనిర్మాతగా) నిర్మించబోతున్నాడు. రామాయణ ప్రాజెక్ట్ కోసం యశ్ హోం బ్యానర్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ కలిసి పని చేయబోతున్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌లో కనిపించబోయే నటీనటుల వివరాలపై స్పష్టత ఇవ్వనున్నారు మేకర్స్. గ్లోబల్ ఆడియెన్స్‌ను చేరుకునేలా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో యశ్ వన్ ఆఫ్ ది లీడ్ యాక్టర్‌గా నటిస్తూనే, నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.