రాకేష్ వర్రె హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జితేందర్ రెడ్డి. ముదుగంటి క్రియేష న్స్ పతాకంపై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకానుంది. 1980కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి లచ్చిమక్క అనే పెళ్లిపాటను విడుదల చేశారు. గోపీసుందర్ స్వరపరచిన ఈ పాటను రాంబాబు గోసాల రచించారు. ఈ గీతా న్ని మంగ్లీ ఆలపించింది. పెళ్లి నేపథ్యంలో ఆద్యంతం సరదాగా ఈ పాట సాగింది. 1980ల నాటి వాతావర ణాన్ని ఆవిష్కరిస్తూ కన్నులపండువగా సాగింది. పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: వి.ఎస్.జ్ఞానశేఖర్, సంగీతం: గోపి సుందర్, దర్శకత్వం: విరించి వర్మ.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)