Skip to main content

Namaste NRI

సింగర్ మంగ్లీ పెళ్లి పాట అదుర్స్.. జితేందర్ రెడ్డి లచ్చిమక్క సాంగ్ రిలీజ్

రాకేష్‌ వర్రె హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జితేందర్‌ రెడ్డి. ముదుగంటి క్రియేష న్స్‌ పతాకంపై ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకానుంది. 1980కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి లచ్చిమక్క అనే పెళ్లిపాటను విడుదల చేశారు.  గోపీసుందర్‌ స్వరపరచిన ఈ పాటను రాంబాబు గోసాల రచించారు. ఈ గీతా న్ని మంగ్లీ ఆలపించింది. పెళ్లి నేపథ్యంలో ఆద్యంతం సరదాగా ఈ పాట సాగింది. 1980ల నాటి వాతావర ణాన్ని ఆవిష్కరిస్తూ కన్నులపండువగా సాగింది. పొలిటికల్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: వి.ఎస్‌.జ్ఞానశేఖర్‌, సంగీతం: గోపి సుందర్‌, దర్శకత్వం: విరించి వర్మ.

Social Share Spread Message

Latest News