ప్రపంచంలో ప్రస్తుతం 4,200కు పైగా మతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తాజాగా కొత్త మతం ఒకటి చేరింది. దీనికి ‘అబ్రహామిక్’గా నామకరణం చేశారు. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం కలయికతో ఈ మతాన్ని ఏర్పాటు చేశారు. వివిధ మతాల మధ్య ఉన్న పరస్పర భేదాలను తొలగించి, ప్రపంచ శాంతి స్థాపనకే ఈ మతాన్ని తీసుకొస్తున్నట్టు 2020లో యూఏఈ, బహ్రెయిన్, ఇజ్రాయెల్ దేశాలు ఓ ఒడంబడికలో పేర్కొన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రోద్బలంతో ఈ ఒడంబడిక తెరమీదకు వచ్చింది. దీన్ని ఆయన అబ్రహామియన్ ఒప్పందం’గా అభివర్ణించారు. జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం మతాల్లో అబ్రహంను మొదటి ప్రవక్తగా గుర్తిస్తారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)