Skip to main content

Namaste NRI

4,200కు పైగా మతాలు ప్రాచుర్యంలో ఉన్న.. ప్రపంచంలోకి మరో కొత్త మతం

ప్రపంచంలో ప్రస్తుతం 4,200కు పైగా మతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తాజాగా కొత్త మతం ఒకటి చేరింది. దీనికి ‘అబ్రహామిక్‌’గా నామకరణం చేశారు. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం కలయికతో ఈ మతాన్ని ఏర్పాటు చేశారు. వివిధ మతాల మధ్య ఉన్న పరస్పర భేదాలను తొలగించి, ప్రపంచ శాంతి స్థాపనకే ఈ మతాన్ని తీసుకొస్తున్నట్టు 2020లో యూఏఈ, బహ్రెయిన్‌, ఇజ్రాయెల్‌ దేశాలు ఓ ఒడంబడికలో పేర్కొన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ప్రోద్బలంతో ఈ ఒడంబడిక తెరమీదకు వచ్చింది. దీన్ని ఆయన అబ్రహామియన్‌ ఒప్పందం’గా అభివర్ణించారు. జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం మతాల్లో అబ్రహంను మొదటి ప్రవక్తగా గుర్తిస్తారు.

Social Share Spread Message

Latest News