అశోక్ గల్లా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ. అర్జున్ జంధ్యాల దర్శకుడు. ప్రశాంత్‌వర్మ కథనందించాడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. ఈ సినిమాలో ఏమయ్యిందే గుండెకు అంటూ సాగే తొలి గీతాన్ని విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్నందించిన ఈ పాటను సురేష్ గంగుల రచించారు. ఈశ్వర్ ధాతు ఆలపించారు. అందమైన ప్రేమభావాలను వ్యక్తపరుస్తూ ఈ పాట సాగింది. నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. విజువల్స్ ప్రధానాకర్షణగా నిలిచాయి. ఆధ్యాత్మిక అంశాల కలబోతగా సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇదని, యాక్షన్ అంశాలు కూడా ఉంటాయని దర్శకుడు తెలిపారు.
ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, దర్శకత్వం: ప్రశాంత్‌వర్మ.