Skip to main content

Namaste NRI

దేవకీ నందన వాసుదేవ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ప్రొమో రిలీజ్

అశోక్‌ గల్లా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ. అర్జున్‌ జంధ్యాల దర్శకుడు. ప్రశాంత్‌వర్మ కథనందించాడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. ఈ సినిమాలో ఏమయ్యిందే గుండెకు అంటూ సాగే తొలి గీతాన్ని విడుదల చేశారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతాన్నందించిన ఈ పాటను సురేష్‌ గంగుల రచించారు. ఈశ్వర్‌ ధాతు ఆలపించారు. అందమైన ప్రేమభావాలను వ్యక్తపరుస్తూ ఈ పాట సాగింది. నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. విజువల్స్‌ ప్రధానాకర్షణగా నిలిచాయి. ఆధ్యాత్మిక అంశాల కలబోతగా సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇదని, యాక్షన్‌ అంశాలు కూడా ఉంటాయని దర్శకుడు తెలిపారు.

ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా, దర్శకత్వం: ప్రశాంత్‌వర్మ.

Social Share Spread Message

Latest News