రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్ హీరోగా నటించిన చిత్రం మిస్టర్ ఇడియట్. సిమ్రాన్‌శర్మ కథానాయిక. గౌరి రోణంకి దర్శకత్వంలో జె.జె.ఆర్.రవిచంద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను హీరో రవితేజ తన సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంలో హీరోహీరోయిన్ల మధ్య సాగే ఫన్ అండ్ క్యూట్ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కిన్నట్టు టీజర్ చెబుతున్నది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: యలమంచి రాణి, నిర్మాణం: జేజేఆర్ ఎంటైర్టెన్‌మెంట్స్.