శర్వానంద్ కథానాయకుడిగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మనమే. కృతిశెట్టి కథానాయిక. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని అగ్రహీరో రామ్‌చరణ్ చేతులమీదుగా మేకర్స్ విడుదల చేశారు. శతమానం భవతి ని మించిన హిట్ మనమే అవుతుందని శర్వానంద్ నమ్మకం వ్యక్తం చేశారు.

థియేట్రికల్‌గా మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదని, నేటి యువతరం తమ తల్లిదండ్రు లకు చూపించాల్సిన సినిమా మనమే అని దర్శకుడు చెప్పారు. నటిగా తన జీవితంలో గుర్తిండిపోయే పాత్ర చేశానని కృతి శెట్టి ఆనందం వెలిబుచ్చింది. ఇంకా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృతిప్రసాద్, అసోసియేట్ ప్రొడ్యూసర్ ఏడిద రాజా, సహనిర్మాత వివేక్ కూచిభోట్ల కూడా మాట్లాడారు. ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది.
