Namaste NRI

గుణశేఖర్‌ యుఫోరియాకు కాలభైరవ స్వరాలు

యుఫోరియా పేరుతో దర్శకుడు గుణశేఖర్‌ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. యూత్‌ఫుల్‌ సోషల్‌డ్రామాగా వినూత్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించ బోతున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కాలభైరవను ఖరారు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఓ స్పెషల్‌ వీడియోను విడుదల చేశారు. కథానుగుణంగా సంగీతానికి ప్రాధాన్యత ఉన్న కథాంశమిదని, కాలభైరవ మ్యూజిక్‌ ప్రత్యేకాకర్షణగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events