అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ విలియం బర్న్స్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఢల్లీిలో భేటీ అయ్యారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులపై వీళ్లిద్దరూ చర్చించారు. అమెరికా ఉగ్రవాదిగా గుర్తించిన వ్యక్తినే తాలిబన్లు ప్రధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ధోవల్, బర్న్స్ ఏం చర్చించారన్న విషయంపై సృష్టత లేదు. దోవల్ ఇప్పటికే రష్యా ఎన్‌ఎష్‌ఏతోనూ భేటీ అయ్యారు. తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజే ఈ ఇద్దరూ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.