ఇంటర్న్‌షిప్ విషయంలో అమెరికాలోని భారత విద్యార్థులు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టేందుకు న్యూయార్క్ లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. దీని ద్వారా అమెరికా లోని కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలతోపాటు న్యాయ, వైద్యపరమైన సమాచారాన్ని కూడా అందించను న్నది. అమెరికాలోని ఈశాన్య రాష్ర్టాలైన కనెక్టికట్, మైనె, మాసాచుసెట్స్, న్యూహ్యాంప్‌షైర్, న్యూజెర్సీ, న్యూయార్క్, ఒహియో, పెన్సిల్వేనియా, రోడ్ ఐలండ్స్, వెర్మాంట్‌లలో ఈ సేవలు అందిస్తుంది. ఇంటర్న్‌షిప్ విషయంలో అర్హులైన భారతీయ విద్యార్థులను పరిగణనలోకి తీసుకునేందుకు అనేక భారతీయ, అమెరికన్ కంపెనీలు, సంస్థలు అంగీకరించినట్టు భారత కాన్సులేట్ వెల్లడించింది.
విద్యార్థులు నేరుగా ఆయా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పలు కంపెనీలు, బహుళజాతి సంస్థలు, టెక్నాలజీ, ప్రభుత్వ సంస్థలు, ఏవియేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, టాటాసన్స్ సహా అనేక రంగాల్లోని కంపెనీలలో విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేసుకునే అవకాశాలకు సంబంధించిన జాబితాను పోర్టల్ సిద్ధం చేస్తుంది.