ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8, 9 తేదీలలో రష్యాను సందర్శించనున్నారు. 22వ భారత్-రష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొని ఉభయ దేశాల మధ్య కొనసాగుతున్న బహుముఖ సంబంధాలను సమీక్షించను న్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ(ఎంఇఎ) ప్రకటించింది. రష్యా పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోడీ ఆస్ట్రియాకు పయనమవుతారని ఎంఇఎ తెలిపింది. గడచిన 41 సంవత్సరాలలో భారత ప్రధాని ఆస్ట్రియాను సందర్శించడం ఇదే మొదటిసారి. గత ఐదేళ్లలో రష్యాను సందర్శించడం మోడీకి ఇదే మొదటిసారి.2019లో ఆయన చివరిసారి రష్యాను సందర్శించారు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో జరిగిన ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొన్నారు.