Namaste NRI

ఆకట్టుకుంటున్న అరి ఫస్ట్‌ లుక్‌

ఆర్వీ సినిమాస్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం అరి. జయశంకర్‌ దర్శకుడు. వినోద్‌వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్‌, శ్రీనివాస రెడ్డి, చమ్మక్‌ చంద్ర ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాలో హాస్య నటులు శ్రీనివాస రెడ్డి, చమ్మక్‌ చంద్ర చతుర్‌, వితుర్‌ పాత్రల్లో కనిపించనున్నారు. వారిద్దరి పోస్టర్‌ను విడుదల చేశారు. అరిషడ్వర్గాలు కాన్సెప్ట్‌ ఆధారంగా సైకలాజికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కి స్తున్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితమైన మలుపులతో పాటు కథలోని వినోదం కూడా ఆకట్టుకుం టుందని, ఓ విభిన్నమైన పాయింట్‌తో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. త్వరలో ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, రచన-దర్శకత్వం: జయశంకర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events