Namaste NRI

కళింగ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన విజయేంద్ర ప్రసాద్

స్వీయ దర్శకత్వంలో ధృవ వాయు హీరోగా నటిస్తున్న చిత్రం కళింగ. ప్రగ్యా నయన్‌ కథానాయిక. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ మరియు ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతి క శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆవిష్కరించా రు. టైటిల్‌ పోస్టర్‌లో లక్ష్మీ నరసింహా స్వామి ఉగ్ర రూపంలో దర్శనమిస్తుండగా, హీరో చేతిలో కాగడా పట్టుకొని కనిపిస్తున్నారు. పోస్టర్‌ను బట్టి డివోషనల్‌ థ్రిల్లర్‌ కథాంశమిదని అర్థమవుతున్నది. ఇప్పటివరకు రానటువంటి వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తు న్నామని, కథలోని మలుపులు ఉత్కంఠను పంచుతాయని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి నిర్మాతలు: దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events