భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రియా కు పయనమై వెళ్లారు. మాస్కో నుంచి బయల్దేరి వెళ్లిన మోదీ, వియన్నాలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ స్కాల్లెన్ బర్గ్‌తోపాటు ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
తనకు అద్భుతమైన స్వాగత ఏర్పాట్లు చేసినందుకు ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెమహ్మర్ కు మోదీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీకి ఛాన్సలర్ కార్ల్ ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. భారత ప్రధాని ఆస్ట్రియా పర్యటకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే తొలిసారి. 1983లో చివరిసారిగా ఇందిరా గాంధీ ఆ దేశాన్ని సందర్శించారు. ఇందిరా గాంధీ తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత ఆ దేశంలో పర్యటించిన రెండో ప్రధానిగా మోదీ నిలిచారు.