Namaste NRI

నచ్చితే ఇద్దరికి…నచ్చకపోతే పదిమందికి చెప్పండి

రవికృష్ణ, సమీర్‌ మళ్లా, రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ది బర్త్‌డే బాయ్‌. విస్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఐ.భరత్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 19న విడుదలకానుంది. ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథ రాసుకున్నాను. నా జీవితంలో తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటనకు కథ రూపం ఇది. ఎం.ఎస్‌. చదవడానికి విదేశాలకు వెళ్లిన ఐదుగురు మిత్రుల నేపథ్యంలో కథ నడుస్తుంది. కామెడీ డ్రామాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా నచ్చితే ఇద్దరికి చెప్పండి. నచ్చకపోతే పది మందికి చెప్పండి. నా అసలు పేరును, నా ఫేస్‌ను సినిమా విడుదలైన తరువాత రివీల్‌ చేస్తాను. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది అన్నారు. ఈ సమావేశంలో ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress