కెనడాలో హిందూ దేవాలయాలపై లక్షిత దాడులు మళ్లీ మొదలయ్యాయి. ఇక్కడి ఎడ్మాంటన్‌లోని బీఏపీఎస్ స్వామి నారాయణ్ మందిరంలో కొంతమంది దుండగులు మళ్లీ విధ్వంసానికి పాల్పడ్డారు. దేవాలయం గోడల పై రంగులు జల్లారు. విద్వేషపూరిత వ్యాఖ్యల్ని రాశారు. ప్రధాని మోదీ, భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య కెనడా వ్యతిరేకులు అంటూ ఆలయ గేటుపై రాశారు. ఈ ఘటనను కెనడా హౌజ్ ఆఫ్ కామన్స్ సభ్యుడు రాండీ బోయిసోనాల్ట్ ఖండించారు. వేర్పాటువాద గ్రూపుల కార్యకలాపాలపై కెనడాలో ఆందోళన వ్యక్తమవుతు న్నది. కెనడాలో హిందువులను టార్గెట్ చేసుకుంటూ పెరుగుతున్న విద్వేషపూరిత దాడులపై ఆ దేశ పార్లమెంట్ సభ్యుడు చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కెనడాలోని విశ్వహిందూ పరిషత్ మండిపడింది.