ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాను రిలీజ్ చేశారు. భారత పాస్‌పోర్ట్‌కు 82వ స్థానం దక్కింది. భారతీయ పాస్‌పోర్ట్‌తో 58 దేశాల్లో వీసా లేకుండా ఎంట్రీ ఇవ్వవచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా ర్యాంక్‌లను రూపొందించారు. ప్రస్తుతం సెనిగల్, తజికిస్తాన్ దేశాల ర్యాంక్‌లతో ఇండియా ర్యాంక్ సమంగా ఉన్నది. అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల్లో సింగపూర్ మొదటి స్థానంలో ఉన్నది. సింగపూర్ పాస్‌పోర్ట్ ఉన్నవారు 195 దేశాల్లో వీసా లేకుండానే ఎంట్రీ ఇవ్వవచ్చు.
రెండో స్థానంలో జపాన్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు పాస్‌పోర్ట్‌లు ఉన్న వారు 192 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ ఇవ్వవచ్చు. మూడవ ర్యాంక్‌లో ఆస్ట్రియా, ఫిన్‌ల్యాండ్, ఐర్లాండ్, లగ్జంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టు ఉన్నవారు 191 దేశాల్లోకి వీసా లేకుండా ఎంట్రీ పొందవచ్చు. నాలుగవ స్థానంలో యూకేతో పాటు న్యూజిలాండ్, నార్వే, బెల్జింయ, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, పోర్చుగల్ ఉన్నాయి. తాజా ర్యాంకింగ్స్‌లో అమెరికా 8వ స్థానానికి పడిపోయింది. అమెరికా వీసా ఉన్నవారు 186 దేశాలకు వీసా ఫ్రీ ప్రవేశం చేయవచ్చు. ఈస్టోనియా, లిథుయేనియా, యూఏఈ దేశాలు 9వ స్థానంలో, ఐస్‌ల్యాండ్, లాతివ్యా, స్లోవేకియా, స్లోవేనియా దేశాలు పదవ ర్యాంక్‌లో ఉన్నాయి.