Namaste NRI

కన్నప్ప మూవీ నుంచి మధుబాల లుక్ రిలీజ్

మహాపుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా తెరకెక్కుతున్న భక్తిరసాత్మక చిత్రం కన్నప్ప. మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రానికి ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ దర్శకుడు. డా.మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌లో ఆయనతోపాటు మోహన్‌లాల్‌, శరత్‌కుమార్‌, ప్రభాస్‌ ఇలా చాలామంచి స్టార్లు భాగమైన విషయం తెలిసిందే. ఈ పాన్‌ ఇండియా మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రమోష న్స్‌ని వేగవంతం చేశారు. ఈ సినిమాలో చెంచువీరనారిగా నటిస్తున్న మధుబాల ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసేలా ఈ పోస్టర్‌ డిజైన్‌ చేశామని, సినిమాటిక్‌ ఎక్స్‌పీరి యన్స్‌ ఇచ్చే విజువల్‌ వండర్‌గా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. త్వరలోనే సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress