Skip to main content

Namaste NRI

 వీలైనంత తొందరగా వైట్‌హౌజ్‌తో చర్చలు : నిక్కీ హేలీ

రష్యా చమురు కొనుగోలు చేస్తున్నదంటూ భారత్‌ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 50శాతం వరకు టారిఫ్‌లు విధించటం ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతున్నది. దీనిపై రిపబ్లికన్‌ నాయకురాలు నిక్కీ హేలీ తాజాగా  కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యల్ని భారత్‌ సీరియస్‌గా తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.పరిష్కారం కోసం న్యూఢిల్లీలోని నాయకత్వం వీలైనంత తొందరగా వైట్‌హౌజ్‌తో చర్చలు జరపాలి  అని అన్నారు. చైనా, భారత్‌ ఒకటి కాదని, భారత్‌ ప్రజాస్వామ్యభాగస్వా మి అంటూ ఆమె పేర్కొన్నారు.  

Social Share Spread Message

Latest News