సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహా ఉల్లాల్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన హారర్ కామెడీ థ్రిల్లర్ భవనమ్. బాలాచారి కూరెళ్ల దర్శకుడు. ప్రతిష్టాత్మక సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఆర్.బి.చౌదరి, వాకాడ అంజన్‌కుమార్, వీరేంద్ర సీర్వి నిర్మాతలు. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
సూపర్‌గుడ్ సంస్థలో నటించాలనే కోరిక ఈ సినిమాతో తీరిందని, ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించిన 95వ చిత్రంలో ఇంతమంది కమెడియన్స్ ప్రధాన పాత్రలు పోషించడం, అందులో నేనూ ఒకడ్ని కావడం ఆనం దంగా ఉందని సప్తగిరి సంతోషం వెలిబుచ్చారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న హారర్ కామెడీ సినిమా ఇదని షకలక శంకర్ చెప్పారు. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కథానాయిక మాళవిక సతీషన్ కృతజ్ఞత లు తెలిపింది. అందర్నీ ఎంటర్‌టైన్ చేసే వినోదభరితమైన సినిమా ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ఇంకా సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ కూడా మట్లాడారు. ఆగస్ట్ 9న సినిమా విడుదలకానుంది.