అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ భారతీయురాలా? లేక నల్ల జాతీయురాలా? అని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. ట్రంప్ షికాగోలో జరిగిన జాతీయ బ్లాక్ జర్నలిస్టుల సంఘం సమావేశంలో మాట్లాడుతూ, కమలా హారిస్ భారతీయురాలని తనకు తెలుసునన్నారు. ఆమె కొన్నేళ్ల క్రితం నల్ల జాతీయురాలిగా మారే వరకు ఆమె నల్లజాతీయురాలనే విషయం తనకు తెలియదన్నారు. ఇప్పుడు ఆమె తాను నల్ల జాతీయురాలిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నారని చెప్పారు. అమెరికా చరిత్రలో ఉపాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నలుపువర్ణ, దక్షిణాసియా మూలాలు ఉన్న వ్యక్తిగా కమలా హ్యారిస్ రికార్డులో నిలిచారు.