Namaste NRI

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో… ఓ ఆసక్తికర పరిణామం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయాలు వేడెక్కాయి. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ బరిలో నిలిచారు. అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు అధ్యక్ష పీఠానికి పోటీ చేసే అవకాశం దక్కింది. ఇక రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష రేసులో ఉన్నారు. బైడెన్ రేసు నుంచి తప్పుకోవడం ఆ పార్టీకి కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే వారంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనున్నది.

ప్రపంచ కుబేరుడైన ఎలాన్‌ మస్క్‌ అధ్యక్ష రేసులో బరిలో నిలిచిన డోనాల్డ్‌ ట్రంప్‌ని ఇంటర్వ్యూ చేయను న్నారు. ఈ విషయాన్ని ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు. ఎలాన్‌ మస్క్‌కి ఇంటర్వ్యూ ఇస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ట్రంప్‌కు ఎలాన్‌ మస్క్‌ మద్దతు ఇస్తూ వస్తున్నారు. సోషల్‌ మీడియాలో మాజీ అధ్యక్షుడు చేసే వ్యాఖ్యలను సమర్థిస్తూ వస్తుంటారు. ఇటీవల ట్రంప్‌ లైవ్‌ స్ట్రీమర్‌ అడిన్‌ రోస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమైంది. దాంతో రికార్డు స్థాయిలో ప్లాట్‌ ఫామ్‌కు రికార్డు స్థాయిలో వ్యూయర్స్‌ పెరగడం విశేషం.

Social Share Spread Message

Latest News