Skip to main content

Namaste NRI

అమెరికాలో కీలక పరిణామం… ఎక్స్ పై

అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2021లో క్యాపిటల్ హిల్స్పై దాడి నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్కు చెందిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలపై ఆయా సంస్థలు నిషేధం విధించాయి. దీంతో ఆ సంస్థలపై ట్రంప్ అప్పట్లోనే దావా వేశారు. ఇప్పుడు ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో ఆయా సంస్థలు సెటిల్మెంట్ చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగానే ఎలాన్ మస్క్ కు చెందిన ఎక్స్ ట్రంప్కు 10 మిలియన్ డాలర్లు (రూ.86 కోట్లు) చెల్లించేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది.

2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2021 జనవరి 6న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు అమెరికా కాంగ్రెస్ వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనంలో సమావేశమైంది. ఆ సమయంలో వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలు ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్పై నిషేధం విధించారు. దీంతో ట్రంప్ ఆయా సంస్థలపై దావా వేశారు. అనంతరం 2023లో వాటిని పునరుద్ధరించారు. ప్రస్తుతం ట్రంప్ మరోసారి అధికారం చేపట్టడంతో వీటిని సెటిల్ చేసుకునేందుకు ఆయా సంస్థలు ముందుకొచ్చాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events