సాయి దుర్గ తేజ్ హనుమాన్ మేకర్స్ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడని తెలిసిం దే. ఈ ప్రాజెక్ట్ ఎస్‌డీటీ 18 గా రానుండగా రోహిత్ కేపీ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. మేకర్స్ చాలా రోజుల తర్వాత కొత్త అప్‌డేట్ అందించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా వస్తోన్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
ఐశ్వర్యలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వసంత పాత్ర లుక్ షేర్ చేశారు. నిర్మానుష్య ప్రదేశం లో కనిపిస్తున్న ఐశ్వర్య లక్ష్మి లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. 1947 హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంలో సాయి తేజ్ ఒక యోధుడి పాత్రలో నటిస్తున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్ టాక్. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో కొనసాగుతోంది. సాయిదుర్గతేజ్ కెరీర్‌లోనే చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.