Namaste NRI

సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వైభవంగా వినాయకచవితి వేడుకలు

సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు. కిండల్‌ కిడ్స్‌ పాఠశాల సభామందిరంలో సశాస్త్రీయంగా కల్పోక్తరీతిలో ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో వినాయక షోడషోపచార, ఏకవింశతి, దూర్వాయుగ్మ, అష్టోత్తర శతనామావళి పూజలతో పాటు , వినాయకోత్పత్తి, శమంతకమణోపాఖ్యానం వంటి కథా శ్రవణాలతో కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి.సుస్మిత కొల్లి అందర్నీ ఆకట్టుకునేలా పూజా వేదికను అలంకరణ చేశారు. విద్యార్థి బృందం దేవుని పాటలతో అందరినీ అలరించింది.

ఈ సందర్భంగా పూజలో పాల్గొన్న పిల్లలు, ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులకు కార్యక్రమ నిర్వాహకులు సుప్రియ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రధానంగా సహకరించిన కిండల్ కిడ్స్ పాఠశాల యాజమాన్యానికి, విగ్రహ దాతలు పుట్టి ప్రసాద్, ముద్దం విజ్జేందర్, తాటిపల్లి విజయబాబు, కొత్తమాసు రాజశేఖర్ కు, పూజారి శ్రీ శ్రవణ్ బల్కికి, ప్రసాదాలు అందించడానికి సహకరించిన దాతలకు, కమిటీ సభ్యులకు, సేవాదళ కార్యకర్తలకు గౌరవ కార్యదర్శి అనిల్ కుమారి పోలిశెట్టి కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress