ఇజ్రాయెల్‌పై లెబనాన్ రాకెట్ల వర్షం కురిపించింది. సఫేద్, దాని పరిసర ప్రాంతాల్లో 55 రాకెట్లతో విరుచుకుప డింది. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. మొదటి విడతగా 20 రాకెట్లు, మరుక్షణంలోనే మరో 35 రాకెట్లతో దాడి జరిగిందని, అయితే వాటిలో చాలావాటిని సమర్ధంగా అడ్డు కొన్నారని, మిగిలినవి మైదాన ప్రాంతాల్లో పడ్డాయని ఆర్మీ అధికారులు చెప్పినట్టు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. దాడికి ముందు జాగ్రత్తగా ఉండాలంటూ ఇజ్రాయెల్ తన పౌరులకు అప్రమత్తం చేసింది. ఈ దాడి జరిగిన కొద్ది సమయం తర్వాత ఇజ్రాయెల్ మిలటరీ జెట్లు దక్షిణ లెబనాన్‌పై రాకెట్ లాంఛర్లను ప్రయోగించా యి. కాగా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వాయుసేన దాడిలో ముగ్గురు మరణించారు.