పవన్‌కల్యాణ్ ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ఓజీ షూటింగ్ దాదాపుగా పూర్తికావచ్చింది. హరిహర వీరమల్లు 60శాతం పూర్తయింది. ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ చాలావరకు మిగిలివుంది. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న పవన్.. ఈ నెల చివరి వారం నుంచి కానీ, వచ్చే నెల తొలివారం నుంచి కానీ హరిహర వీరమల్లు షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తున్నది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక. ఇందులో అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్, విక్రమ్‌సింగ్ విర్క్, నోర ఫతేహి, నర్గీస్ ఫక్రీ, సచిన్ ఖేడ్కర్, జిషుసేన్ గుప్తా. దాలిప్ తాహిల్ కీలక పాత్రధారులు. ఎ.దయాకరరావు, ఏ.ఎం రత్నం భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రోజులో ఒక పూట షూటింగ్‌కు, ఒక పూట పాలనకు కేటాయించాలని పవన్ నిర్ణయించారట. నిర్మాతకు ప్రతి క్షణం విలువైనదే కాబట్టి, సమయం వృథా కాకుండా షూటింగ్‌కి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఒక ప్లాన్ ప్రకారం ముందుగానే పూర్తి చేస్తున్నారట. ఈ సినిమాకు ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.