ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రానికి డేగల బాజ్జీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వెంకట్ చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతిచంద్ర నిర్మిస్తున్నారు. టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ తమిళంలో విజయవంతమైన ఒత్తు సెరుప్పు సైజ్ 7 సినిమాకు రీమేక్ ఇది. తమిళంలో పార్తిబన్ పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. లుక్స్‌పరంగా సరికొత్తగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : అరుణ్ దేవినేని, సంగీతం : లైనస్ మధిరి, మాటలు: మరుధూరి రాజా, దర్శకత్వం : వెంకట్‌చంద్ర.