త్రిగుణ, మేఘాచౌదరి లీడ్‌రోల్స్ చేస్తున్న కామెడీ థ్రిల్లర్ జిగేల్. మల్లి యేలూరి దర్శకుడు. డా.వై.జగన్ మోహన్, నాగార్జున అల్లం నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. దర్శకుడు హను రాఘవపూడి టీజర్‌ని లాంచ్ చేశారు. త్రిగుణను లాకర్ టెక్నీషియ న్‌గా పరిచయం చేస్తూ టీజర్ మొదలైంది. ఇరవై ఏండ్లుగా ఎలా తెరవాలో తెలియని ఓ లాకర్‌ని ప్రజెంట్ చేస్తూ వచ్చిన సీక్వెన్స్ ఆసక్తికరంగా ఉంది. హీరో పాత్ర చిత్రణ, హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్‌తో టీజర్ కలర్‌ఫుల్ డిజైన్ చేశారు. ఇంకా షాయాజీ షిండే, పోసాని కూడా టీజర్‌లో కనిపించారు. రఘుబాబు, పృథ్వీరాజ్, మధు నందన్, ముక్కు అవినాశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు, మాటలు: రమేశ్ చెప్పాల, నాగార్జున అల్లం, సంగీతం: ఆనంద్ మంత్ర, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు.