నార్నే నితిన్ హీరోగా రూపొందిన లవ్, ఫ్యామిలీ ఎంటైర్టెనర్ శ్రీ శ్రీ శ్రీ రాజావారు. సతీశ్ వేగేశ్న దర్శకుడు. చింతపల్లి రామారావు నిర్మాత. సంపద ఇందులో కథానాయిక. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి టీజర్‌ని లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. మ్యాడ్, ఆయ్ చిత్రాలతో వరుస విజయాలను అందుకు హీరో నార్నె నితిన్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టనున్నాడని, శతమానంభవతి తర్వాత దర్శకుడు వేగేశ్న సతీశ్ నుంచి వస్తున్న మరో అద్భుత మైన ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ఇదని నిర్మాత తెలిపారు. నరేశ్, రావురమేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. దసరా కానుకగా సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: దాము నర్రావుల, సంగీతం: కైలాష్ మీనన్, సమర్పణ: రంగాపురం రాఘవేంద్ర, మురళీకృష్ణ చింతలపాటి.