ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కల్యాణ్‌రామ్ దేవర చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ దేవర లో నా తమ్ముడు యాక్టింగ్‌తో అదరగొట్టాడు. ఇది ఎన్టీఆర్ వన్‌మ్యాన్ షో అని గర్వంగా చెబుతున్నా. ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ మూడేళ్లుగా ఈ సినిమాతో ప్రయాణం సాగిస్తున్నా. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో దేవర చిత్రం అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఇది నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అని అందరూ మెచ్చుకుంటున్నారు అని చెప్పారు. ఈ చిత్రానికి విదేశాల్లో కూడా అద్భుతమైన ఆదరణ లభిస్తున్నదని, ఎన్టీఆర్ నటన మరో స్థాయిలో ఉందని, ఇది ఆయన వన్‌మ్యాన్‌షో అని నైజాంలో దేవర ను డిస్ట్రిబ్యూట్ చేసిన అగ్ర నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు.