ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడిందని ఆయన అన్నారు. దీనికి ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ఇరాన్ లోని నిరంకుశ పాలనను అంతం చేసి ప్రజలకు స్వేచ్ఛ కల్పిస్తామని ప్రకటించారు.
ఇరాన్ క్షిపణుల దాడి తర్వాత జెరూసలెంలో అధికారులతో భద్రతా కేబినెట్ సమావేశంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ ఇరాన్ చర్యలు మొత్తం మధ్య ఆసియానే ప్రమాదంలోకి నెట్టేసిందని అన్నారు. మధ్య ఆసియా మొత్తాన్ని యుద్ధంలోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. దీనికి ఇరాన్‌కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పోరాడతాం, కచ్చితంగా గెలిచి తీరుతామని వ్యాఖ్యానించారు.