ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. తమపై క్షిపణుల దాడికి ప్రతీకారం తీర్చుకుం టామని ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. తమ సుప్రీం లీడర్ ఖమేనిని సురక్షిత ప్రాంతానికి తరలించింది. అనంతరం ఇజ్రాయెల్ వార్నింగ్‌కు ఇరాన్ ధీటుగా బదులిచ్చింది. ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ఇది శాంపిల్ మాత్రమేనని, అసలు దాడులు త్వరలోనే ఉంటాయని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ హెచ్చరించారు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధమని ప్రకటించారు.