నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు పిల్లలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు పాల్పడుతున్న గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ 8 లక్షల యాప్‌లపై నిషేధం విధించాయి. పిక్సలేట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్ 1 2021 డీలిస్టెడ్ మొబైల్ యాప్స్ రిపోర్ట్ పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ 2021 మొదటి అర్ధభాగంలో 8,13,000కు పైగా యాప్‌లపై నిషేధం విధించినట్లు ఈ నివేదిక పేర్కొంది. వీటీలో 86 శాతం యాప్‌లు పిల్లలే లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించామని నివేదికలో తెలిపింది. ఈ యాప్స్ తొలగింపునకు ప్రధాన కారణం గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నియమాలు ఉల్లంఘించడమే కాకుండా ఇతర కారణాలు ఉన్నాయి.
హెచ్ 1 2021 డీలిస్టెడ్ మొబైల్ యాప్స్ రిపోర్ట్ కొన్ని కీలక డేటా పాయింట్లను పంచుకుంది. ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో 5 మిలియన్లకు పైగా మొబైల్ యాప్‌లను ఈ కంపెనీ విశ్లేషించింది. అంతేగాక, ఈ యాప్స్ డీలిస్టింగ్ కు ఈ యాప్‌లకు సుమారు 21 మిలియన్ యూజర్ రివ్యూలు ఉన్నట్లు వెల్లడిరచింది. అందువల్ల ఇంకా లక్షలాది యాప్ వినియోగదారులు వీటిని వినియోగించే అవకాశం ఉన్నట్లు నివేదిక తెలిపింది.