Skip to main content

Namaste NRI

ఆ 8 లక్షల యాప్ప్ తొలగింపు

నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు పిల్లలను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ దాడులకు పాల్పడుతున్న గూగుల్‌ ప్లే స్టోర్‌, ఆపిల్‌ యాప్‌ స్టోర్‌ 8 లక్షల యాప్‌లపై నిషేధం విధించాయి. పిక్సలేట్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ హెచ్‌ 1 2021 డీలిస్టెడ్‌ మొబైల్‌ యాప్స్‌ రిపోర్ట్‌ పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. గూగుల్‌ ప్లే స్టోర్‌, ఆపిల్‌ యాప్‌ స్టోర్‌ 2021 మొదటి అర్ధభాగంలో 8,13,000కు పైగా యాప్‌లపై నిషేధం విధించినట్లు ఈ నివేదిక పేర్కొంది. వీటీలో 86 శాతం యాప్‌లు పిల్లలే లక్ష్యంగా సైబర్‌ దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించామని నివేదికలో తెలిపింది. ఈ యాప్స్‌ తొలగింపునకు ప్రధాన కారణం గూగుల్‌ ప్లే స్టోర్‌, ఆపిల్‌ యాప్‌ స్టోర్‌ నియమాలు ఉల్లంఘించడమే కాకుండా ఇతర కారణాలు ఉన్నాయి.

                హెచ్‌ 1 2021 డీలిస్టెడ్‌ మొబైల్‌ యాప్స్‌ రిపోర్ట్‌ కొన్ని కీలక డేటా పాయింట్లను పంచుకుంది. ఆపిల్‌ యాప్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లే స్టోర్‌లో 5 మిలియన్లకు పైగా మొబైల్‌ యాప్‌లను ఈ కంపెనీ విశ్లేషించింది. అంతేగాక, ఈ యాప్స్‌ డీలిస్టింగ్‌ కు ఈ యాప్‌లకు సుమారు 21 మిలియన్‌ యూజర్‌ రివ్యూలు ఉన్నట్లు వెల్లడిరచింది. అందువల్ల ఇంకా లక్షలాది యాప్‌ వినియోగదారులు వీటిని వినియోగించే అవకాశం ఉన్నట్లు నివేదిక తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events