విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు నినాదంతో సత్యారెడ్డి రూపొందించిన చిత్రం ఉక్కు సత్యాగ్రహం. ఈ సందర్భంగా హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విప్లవకవి కవి గద్దర్ నటించిన ఆఖరు చిత్రం ఇది. ఎంతోమంది ఉద్యమకారులను దృష్టిలోపెట్టుకొని ఈ సినిమా కథానాయకుని పాత్రను గద్దరే తీర్చిదిద్దారు. నిజజీవితానికి దగ్గరగా ఉండే ఉద్యమ చిత్రం ఇది అని దర్శక, నిర్మాత సత్యారెడ్డి తెలిపారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రయివేటీకరణ నేపథ్యంలో జరుగుతున్న ఉద్యమాన్ని కళ్లకు కట్టేలా ఈ సినిమా చూపిం చారని మాజీ సీబీఐ డైరెక్టర్ వి.వి.లక్ష్మినారాయణ తెలిపారు. ఈ సమావేశంలో గద్దర్ కుమార్తె వెన్నెల కూడా పాల్గొన్నారు. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. పల్సర్బైక్ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ, ఎం.వి.వి. సత్య నారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీకోటి.