ఆది సాయికుమార్ నటిస్తున్న సూపర్ నాచురల్ థ్రిల్లర్ శంబాల. అర్చన అయ్యర్ కథానాయిక. యుగంధర్ ముని దర్శకుడు. రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్‌రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ రామోజీఫిల్మ్ సిటీలో మొదలైంది. ఇందులో ఆది సాయికుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ టచ్ చేయని పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, హాలీవుడ్ స్థాయి నిర్మాణ విలువలతో హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో శంబాల చిత్రాన్ని రూపొందించనున్నామని, ఆది కెరీర్‌ని మలుపు తిప్పే సినిమా అవుతుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ మద్దూరి సంగీతాన్ని అందిస్తున్నారు.