తెలుగు సినిమా బాలీవుడ్, హాలీవుడ్‌తో పోటీ పడుతున్నది. రాబోయే కాలంలో హాలీవుడ్‌కు ధీటుగా ఎదగాలన్నా, తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌ను తెరపై ఆవిష్కరించాలన్నా ఇలాంటి వీఎఫ్‌ఎక్స్, ఏఐ టెక్నాలజీ అవసరం ఎంతైనా ఉంది అని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. కల్పర వీఎఫ్‌ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ సర్వీస్‌ను హైదరాబాద్‌లో డాక్టర్ మల్లీశ్వర్ లాంచ్ చేశారు.హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హరీష్‌రావు మాట్లాడుతూ అమెరికాలో స్థిరపడి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు మల్లీశ్వర్. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని నేను ఆహ్వానిస్తే, సిద్ధిపేటలో ఐటీ కంపెనీ స్థాపించి ఎంతో మంది గ్రామీణ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ మల్లీశ్వర్. ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ వెంట పడుతున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన మల్లీశ్వర్‌కు నా అభినందనలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.
కల్పర వీఎఫ్‌ఎక్స్, ఏఐ సర్వీసెస్ సీఈవో మల్లీశ్వర్ మాట్లాడుతూ యూస్‌లో నాకు ఐటీ కంపెనీలున్నాయి. ఏఐ ద్వారా అక్కడ కొన్ని ప్రొడక్ట్స్ డెవలప్ చేశాం కూడా. వీఎఫ్‌ఎక్స్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఇక్కడ ఎక్కువగా రూపొందుతు న్నాయి. అందుకే హాలీవుడ్ టెక్నాలజీని టాలీవుడ్‌కి అందించాలని ఈ సర్వీస్‌ని ఇక్కడ స్టార్ట్ చేశాం. ఈ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందో దర్శకులు రాజమౌళి, నాగ్‌అశ్విన్‌లకు బాగా తెలుసు. టాలీవుడ్‌తోపాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మా వంతు పాత్ర పోషిస్తాం అని తెలిపారు. ఇంకా దర్శకుడు కరుణకుమార్, రఘుకుంచె, పీపుల్ మీడియా డైరెక్టర్ వందన, నటుడు విక్రాంతిరెడ్డి కూడా మాట్లాడారు.