వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ మ్యూజికల్ నైట్ ఈవెంట్ ని మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడారు. ఇది నా 76వ సినిమా. అనిల్ రావిపూడి వండర్‌ఫుల్ స్క్రిప్ట్ ఇచ్చారు. సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. నా అభిమానులు నన్నెలా చూడాలని కోరుకుంటారో, ఇందులో అలా కనిపిస్తా. అనిల్ ప్రతిసీన్ అద్భుతంగా తీశాడు. సినిమా అంతా నవ్వులే ఉంటాయి. నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారు. పనిచేసిన వారంతా ప్రాణం పెట్టి పనిచేశారు. సంక్రాంతికి వస్తున్నాం.. మీరంతా ఫ్యామిలీలతో రావాలి. మామూలుగా ఉండదు ఎంజాయిమెంట్ అని అన్నారు.
సంక్రాంతికి వస్తున్నాం మీరంతా కొత్తగా ఫీలయ్యే కామెడీ ఫిల్మ్. చాలా డిఫరెంట్‌గా ట్రైచేశాను. నా ఏడు సినిమాలు హిట్స్ చేశారు. ఇప్పుడు ఎనిమిదో సినిమాతో వస్తున్నా. ఇది నా కెరీర్‌లో బెస్ట్ ఎంటైర్టెనర్. మరో బ్లాక్‌బస్టర్ పక్కా. వెంకటేశ్ ఒక టీచర్‌లా, ఒక ఫ్రెండ్‌లా, సడన్‌గా స్టూడెంట్‌లా, మరోవైపు పెద్దమనిషిలా అనిపిస్తారు. ఒక వ్యక్తిలో ఇన్ని క్వాలిటీస్ వుండటం నాట్ ఏ జోక్. వెంకటేష్‌గారితోపాటు పనిచేసిన అందరూ నాకు ఎనర్జీనిచ్చి ముందుకు నడిపిం చారు. జనవరి 14న మిస్ అవ్వద్దు. హిస్టరీలో వెంకీసార్ ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్‌బస్టరే. ఇదీ అంతే అని అనిల్ రావిపూడి నమ్మకం వెలిబుచ్చారు. బ్లాక్‌బస్టర్ ఆన్‌ది వే అంటూ దిల్‌రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు.