Namaste NRI

ఎల్.వై.ఎఫ్‌ మూవీ మంచి విజయం సాధించాలి : మంత్రి కోమటిరెడ్డి

 శ్రీహర్ష, కషిక కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ఎల్‌.వై.ఎఫ్‌. పవన్‌ కేతరాజు దర్శకుడు. కిషోర్‌ రాటి, మహేష్‌ రాటి, ఏ.రామస్వామి రెడ్డి నిర్మాతలు. ఈ చిత్ర టీజర్‌ను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తక్కువ బడ్జెట్‌లో మంచి కంటెంట్‌తో సినిమాలు రావాల్సిన అవసరం ఉందన్నారు.అలాంటి చిత్రాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇన్నోవేటివ్‌ కథతో వస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. వినూత్న ప్రేమకథగా ఈ సినిమా ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. ఎస్‌.పి.చరణ్‌, నవాబ్‌షా, ప్రవీణ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: మణిశర్మ, రచన-దర్శకత్వం: పవన్‌కేతరాజు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events